ఎగిరే బిడ్డ
ఒక చెరకు రైతు.. కొత్త ట్రాక్టర్ కొన్నాడు. బండిని వినాయకుడి గుడికి తీసుకెళ్లి పూజ చేయించాలనుకున్నాడు. పూజా సామగ్రి తీసుకుని ఊరి నుంచి కుటుంబ సమేతంగా బయలుదేరాడు.
ఒక చెరకు రైతు.. కొత్త ట్రాక్టర్ కొన్నాడు. బండిని వినాయకుడి గుడికి తీసుకెళ్లి పూజ చేయించాలనుకున్నాడు. పూజా సామగ్రి తీసుకుని ఊరి నుంచి కుటుంబ సమేతంగా బయలుదేరాడు. ఊర్లోని ఇరుగుపొరుగు ‘మేము కూడా గుడికి వస్తామని’ ట్రాక్టర్లో ఎక్కి కూర్చున్నారు. ఊరి మధ్యలో చెరకు రైతుకు తన పాత స్నేహితుడైన ఎరువుల వ్యాపారి కనిపించాడు. ‘వినాయకుడి గుడికి వెళ్తున్నాం, ట్రాక్టర్లో ఖాళీ ఉంది. నువ్వు కూడా రావచ్చు కదా’ అని ఎరువుల వ్యాపారిని ఆహ్వానించాడు చెరకు రైతు.
‘నాకు దేవుడి మీద నమ్మకం లేదు. అయినా దేవుడిని నమ్మితే ఏమొస్తుంది?’ అని ఎదురు ప్రశ్న వేసి అక్కడినుంచి వెళ్లబోయాడు ఎరువుల వ్యాపారి. అతని వైపు ఆశ్చర్యంగా చూశారు ట్రాక్టర్లో కూర్చొని ముచ్చట్లాడుతున్న ఇరుగుపొరుగు. అప్పుడే… దూరంగా ఒక తల్లి తన చిన్న బిడ్డను సరదాగా పైకి ఎగురవేస్తూ పట్టుకోసాగింది. కింద పడిపోతానని భయపడకపోగా ఆ బిడ్డ నవ్వుతూ ఉంది. దాన్ని చూసిన చెరకు రైతు, బండిని పక్కకి ఆపాడు. ఎరువుల వ్యాపారిని దగ్గరికి పిలిచి, ఎగిరే బిడ్డను చూపిస్తూ ‘అంతలా ఎగిరేస్తున్నా.. ఆ చిన్న బిడ్డ భయపడకుండా ఎందుకు నవ్వుతున్నది?’ అని అడిగాడు.
‘తన తల్లి తనను కింద పడనివ్వదు, కచ్చితంగా పట్టుకుంటుందన్న నమ్మకంతో బిడ్డ నవ్వుతున్నది’ అన్నాడు వ్యాపారి. రైతు చిరునవ్వుతో ‘మనకి ఎన్ని కష్టాలొచ్చినా మనల్ని కింద పడకుండా కాపాడుతాడన్న నమ్మకమే దైవం. ఆ నమ్మకంతోనే మనం ఎన్నో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటాం. దైవ నమ్మకం ఉంటే దుఃఖం కూడా ధైర్యంగా మారుతుంది. ఆలోచించి చూడు’ అని చెప్పి ట్రాక్టర్ని స్టార్ట్ చేశాడు. ట్రాక్టర్ ట్రాలీలో కూర్చుని ఉన్న వారి మధ్య నుంచి ‘రైట్ రైట్’ అనే శబ్దం వినిపించింది. ‘ఎవరా’ అని రైతు వెనక్కి తిరిగి చూస్తే ఎరువుల వ్యాపారి నవ్వుతూ కనిపించాడు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు 93936 62821
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

