మగ బిడ్డ కోసం తహతహ : నవజాత శిశువును అపహరించి..

అహ్మదాబాద్ : ఏడుగురు కూతుర్లున్న ఓ మహిళ మగ బిడ్డ కోసం గాంధీనగర్ ప్రభుత్వ దవాఖాన నుంచి నవజాత శిశువును కిడ్నాప్ చేసింది. బాధితురాలి నుంచి బిడ్డను అపహరించేందుకు మహిళ నర్సుగా నమ్మబలికింది. పోలీసులు కేసును చేధించి చిన్నారిని తల్లి చెంతకు చేర్చారు. నిందితురాలిని 30 ఏండ్ల అస్మిత భారతిగా గుర్తించారు. నిందితురాలు, ఆమె భర్తను బనస్కంత జిల్లాలో గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మార్చి 28న మహిళ దవాఖానలో చేరి ఏప్రిల్ 1న మగబిడ్డకు జన్మనిచ్చింది. డిశ్చార్జి అయ్యే సమయంలో నర్సుగా పరిచయం చేసుకున్న అస్మిత మహిళతో కలిసి ఆమెకు సహాయకురాలిగా బాధితురాలి ఇంటికి వెళ్లింది.
ఆపై తిరిగి చెకప్ కోసం మహిళతో కలిసి అస్మిత దవాఖానకు వచ్చింది. ఈ క్రమంలో మహిళ నుంచి బిడ్డను గుంజుకుని పారిపోయింది. నేరంలో అస్మితకు ఆమె భర్త సహకరించాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు 200 కెమెరాల నుంచి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితురాలు దవాఖాన నుంచి నవజాత శిశువును తీసుకుని రిక్షాలో వెళుతున్నట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో వెల్లడైంది. ఎట్టకేలకు బనస్కంత ప్రాంతంలో నిందితురాలిని పట్టుకున్న పోలీసులు నవజాత శిశువును రక్షించి తల్లికి అప్పగించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

