Monkeys attack: కోతుల దాడిలో బీజేపీ నాయకుడి భార్య మృతి
Monkeys attack: కోతుల దాడిలో ( Monkeys attack ) ఓ బీజేపీ నాయకుడి భార్య మృతిచెందింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది

లక్నో: కోతుల దాడిలో ( Monkeys attack ) ఓ బీజేపీ నాయకుడి భార్య మృతిచెందింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక బీజేపీ నాయకుడు అనిల్ కుమార్ చౌహాన్, సుష్మా దేవి (50) ఇద్దరూ భార్యాభర్తలు. మంగళవారం మధ్యాహ్నం సుష్మా దేవి తన ఇంటి మూడో అంతస్తులో ఉండగా ఒక్కసారిగా కోతుల మంద దాడిచేసింది.
కోతుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె భవనం మూడో అంతస్తు నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

