25వ అంతస్తు పైనుంచి పడి.. కవల సోదరుల మృతి

లక్నో: కవల సోదరులు అపార్ట్మెంట్ బిల్డింగ్‌లోని 25వ అంతస్తు పైనుంచి కిందపడి మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. సిద్ధార్థ్ విహార్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని 25వ అంతస్తులోని ఇంట్లో ఒక కుటుంబం నివాసం ఉంటున్నది. తండ్రి ఆఫీస్ పనిమీద ముంబై వెళ్లాడు. తల్లి, కుమార్తె, 14 ఏండ్ల కవల సోదరులు శనివారం రాత్రి ఇంట్లో నిద్రించారు.
అయితే అర్ధ రాత్రి తర్వాత కవల సోదరులైన సత్యనారాయణ, సూర్యనారాయణ 25వ అంతస్తు పైనుంచి కిందపడి చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. తమ ఇంటి ఫ్లోర్ పైనుంచి కవల సోదరులు ఎలా కిందపడ్డారు అన్నది తెలియలేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. చనిపోయిన కవల సోదరులు 9వ తరగతి చదువుతున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

