వజ్రాల వ్యాపారి ఇంట్లో చోరీ : రూ. 40 లక్షల విలువైన వజ్రాలు అపహరణ
వజ్రాల వ్యాపారి ఇంట్లో చోరీ | నాగోల్ డివిజన్ మధురానగర్‌లోని ఓ వజ్రాల వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. దాదాపు రూ. 40 లక్షల విలువైన వజ్రాలను, జాతిరత్నాలను దొంగలు అపహరించా రు.

హైదరాబాద్ : నాగోల్ డివిజన్ మధురానగర్‌లోని ఓ వజ్రాల వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. దాదాపు రూ. 40 లక్షల విలువైన వజ్రాలను, జాతిరత్నాలను దొంగలు అపహరించారని శుక్రవారం బాధితుడు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్ టీం అన్ని ఆధారాలు సేకరించి ఈ నెల 15న చోరీ జరిగినట్లు గుర్తించారు. మధురానగర్‌కు చెందిన మురళీకృష్ణ అనే వ్యక్తి నగరంలో 3 చోట్ల వజ్రాలు, జాతిరత్నాల విక్రయ దుకాణాలు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 10న ముంబై నుంచి రూ. 1.2 కోట్ల విలువైన వజ్రాలు, జాతిరత్రాలు తీసుకువచ్చినట్లు మురళీకృష్ణ పోలీసులకు ఇచ్చి ఫిర్యాదులో పేర్కొన్నాడు. చోరీకి పాల్పడినది ఎవరన్న దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

