Missing | మెడికల్ షాపుకు వెళ్లిన మహిళ అదృశ్యం

కొండాపూర్ : మెడికల్ షాపుకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిన గృహిణి అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఒడిస్సాకు చెందిన మహేంద్ర కుమార్ బెహరాకు భార్య కడంబారి బెహరా (30), ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కాగా మహేంద్ర కుమార్ గత కొంతకాలంగా అపర్ణ జెనిత్ లేబర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. భార్య కబంబారి బెహరా స్థానికంగా ఇండ్లల్లో పని చేస్తుంది. ఇదే క్రమంలో గత డిసెంబర్ 11న ఇంట్లో నుంచి మెడికల్ షాపుకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్ళింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో తెలిసిన వారిని, బంధువులను ఆరా తీయగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు.
కాగా కడంబారి బెహరా తనతో కలిసి పనిచేసే అభినందన్ బర్మన్తో కలిసి వెళ్ళినట్లు మహేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చందానగర్ పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

