లోదుస్తులు దొంగిలించిన యువకుడ్ని గదిలో బంధించగా ఆత్మహత్య

భోపాల్: పొరుగింట్లో లోదుస్తులు దొంగిలించిన ఒక యువకుడ్ని గదిలో బంధించగా ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. 17 ఏండ్ల యువకుడు గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న తన కజిన్ ఇంటికి వచ్చాడు. శనివారం రాత్రి పొరుగింటి వారికి చెందిన లోదుస్తులు దొంగిలించాడు. గమనించిన పొరుగింటి దంపతులు రవి, అతడి భార్య ఆ యువకుడ్ని వెంబడించారు. కాగా, అతడు పరుగెత్తి తన కజిన్ ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.
దీంతో ఆ దంపతులు ఆ గదికి బయట నుంచి లాక్ చేశారు. యువకుడి సోదరుడు, పోలీసులకు వారు ఫోన్ చేశారు. పోలీసులు అక్కడకు వచ్చి తలుపు తెరువగా ఆ యువకుడు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అక్కడ ఉన్న దొంగిలించిన లోదుస్తులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువకుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు.
మరోవైపు కజిన్ ఫిర్యాదుతో యువకుడి ఆత్మహత్యకు కారణమైన పొరుగింటి దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాము యువకుడ్ని పోలీసులకు పట్టించేందుకు గదికి లాక్ చేశామని, అతడి ఆత్మహత్యకు తాము బాధ్యులం కాదని ఆ దంపతులు, వారి బంధువులు వాదించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

