బాలికపై అత్యాచారం.. పరారీలో నిందితుడు

ఫతేపూర్ : ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేఫూర్ జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై ఓ వ్యక్తి లైంగికదాడి చేసి పరారయ్యాడు. ఆదివారం ఈ ఘటన జరగ్గా సోమవారం సాయంత్రం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆచూకీ కోసం గాలిస్తున్నామని ఫతేపూర్ నగర పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సత్యేంద్రసింగ్ తెలిపారు. బాధితురాలి వయసు 17-18 ఏళ్ల మధ్య ఉంటుందని, వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు పంపామని పేర్కొన్నారు.
2019 జులైలో బాధితురాలి తల్లి నిందితుడి సోదరుడితోపాటు పలువురు తనపై అత్యాచారం చేశారని కేసు పెట్టింది. ఈ కేసులో ఇప్పటికే చార్జీషీటు దాఖలు చేసినట్లు ఎస్హెచ్ఓ వెల్లడించారు. గతేడాది డిసెంబర్‌లోనూ బాధితురాలి తల్లి మరో ఇద్దరిపై ఇదే తరహాలో కేసు పెట్టి తరువాత రాజీ కుదుర్చుకొని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. కేసును అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ సత్యేంద్ర సింగ్ పేర్కొన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

