అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. కొడుకును చంపిన తల్లి
Sangareddy | ఓ తల్లి దారుణానికి పాల్పడింది. తన సుఖం కోసం కుమారుడిని చంపింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలోని శాంతినగర్‌లో వెలుగు చూసింది.
జహీరాబాద్ : ఓ తల్లి దారుణానికి పాల్పడింది. తన సుఖం కోసం కుమారుడిని చంపింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలోని శాంతినగర్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. హోతి(కే) తాండకు చెందిన అక్షయ్ రాథోడ్(24) తన తల్లి యశోద భాయ్‌తో కలిసి శాంతినగర్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే తల్లి యశోద అదే గ్రామానికి చెందిన ప్రేమ్ దాస్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం కుమారుడికి తెలియడంతో తల్లిని పలుమార్ల మందలించాడు. ప్రేమ్ దాస్‌తో సంబంధాలు మానుకోవాలని హెచ్చరించాడు. తల్లి పెడచెవిన పెట్టింది.
తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న కుమారుడిని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. దీంతో ఆదివారం కుమారుడు నిద్రిస్తున్న సమయంలో తన ప్రియుడు ప్రేమ్ దాస్‌తో కలిసి అతనిపై రోకలిబండతో మోది హత్య చేసింది. ఈ కేసులో యశోద, ప్రేమ్ దాస్‌ను అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరు పరిచామని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

