Video: కారు డోర్ తెరువడంతో లారీని ఢీకొన్న బైక్… వీడియోతో పోలీస్ అధికారి మెసేజ్
రోడ్డుపై నిలిచిన కారు డోర్‌ను డ్రైవర్ ఒక్కసారిగా తెరిచాడు. దీంతో ఆ కారు పక్కగా బైక్‌పై వెళ్తున్న వారు షాక్ అయ్యారు. బైక్‌ను ఒక్కసారిగా పక్కకు మళ్లించడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు.
బెంగళూరు: రోడ్డుపై నిలిచిన కారు డోర్‌ను డ్రైవర్ ఒక్కసారిగా తెరిచాడు. దీంతో బైక్‌పై వెళ్తున్న వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బెంగళూరు తూర్పు డివిజన్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) కళా కృష్ణస్వామి ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. డ్రైవర్ల అజాగ్రత్త ప్రవర్తన ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తాయని ఆయన హెచ్చరించారు. కాగా, ఇది పాత వీడియో. 2017 ఏప్రిల్ 19న ఈ ప్రమాదం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తున్నది. రోడ్డుపై నిలిచిన కారు డోర్‌ను డ్రైవర్ ఒక్కసారిగా తెరిచాడు. దీంతో ఆ కారు పక్కగా బైక్‌పై వెళ్తున్న వారు షాక్ అయ్యారు. బైక్‌ను ఒక్కసారిగా పక్కకు మళ్లించడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. గమనించిన స్థానికులు ఆ యువకులను కాపాడేందుకు పరుగున వారి వద్దకు వెళ్లారు. అయితే వారి పరిస్థితి ఏమిటన్నది తెలియలేదు.
కాగా, బెంగళూరు తూర్పు డివిజన్ ట్రాఫిక్ డీసీపీ కళా కృష్ణస్వామి ఈ వీడియోను ట్విట్టర్లో బుధవారం పోస్ట్ చేశారు. ‘దయచేసి మీరు మీ వాహనం తలుపులు తెరిచినప్పుడు అప్రమత్తంగా ఉండండి. ప్రాణాంతక ప్రమాదాలను నివారించండి’ అని సందేశం ఇచ్చారు. పలువురు ట్రాఫిక్ పోలీస్ అధికారులకు ఈ వీడియోను ట్యాగ్ చేశారు. ఒళ్లు జలదరింపజేసే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
https://twitter.com/DCPTrEastBCP/status/1575016875121332236?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1575016875121332236%7Ctwgr%5Ede0b69b1c7d936944873c349ab9423aebdd7f79f%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Findia-news%2Fvideo-police-officer-tweets-accident-video-in-a-message-to-careless-drivers-3387467
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
స్ట్రోక్ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ఎన్నికల్లో విదేశీ జోక్యం: బెంజిమన్ నెతన్యహూ
KTR | ఇంకా ఆ వరుసలో చాలా మంది ఉన్నారు.. కొండా సురేఖ క్షమాపణలపై కేటీఆర్
CPM | తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం రూ.50 వేల కోట్లు నష్టపరిహారంగా అందించాలి : సీపీఎం
YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

