దొంగను పట్టుకున్నారు… పొలీస్ కొడుకని తెలిసి నోరెళ్లబెట్టారు
పాట్నా: షాపులో డబ్బులు చోరీ చేసిన దొంగను పట్టుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వచ్చిన పోలీస్ ఆ దొంగను చూసి తన కుమారుడని చెప్పాడు. దీంతో స్థానికులు నోరెళ్లబెట్టారు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు బట్టల షాపులున్నాయి. కొన్ని రోజుల కిందట ఒక యువకుడు ఒక షాప్‌లోని క్యాష్ కౌంటర్ నుంచి డబ్బులు దొంగిలించాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అతడ్ని గుర్తించి మిగతా షాపు యజమానులకు చూపించారు. మళ్లీ వస్తే ఆ దొంగను పట్టుకోవాలని అంతా నిర్ణయించారు.
కాగా, బుధవారం సాయంత్రం తర్వాత ఆ యువకుడు మళ్లీ ఆ ప్రాంతానికి వచ్చాడు. ఒక షాపులోకి చొరబడి క్యాష్ కౌంటర్లోని డబ్బులను చోరీ చేశాడు. దీంతో స్థానిక వ్యాపారులు అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించేందుకు ఫోన్ చేశారు.
ఇంతలో ఒక పోలీస్ అక్కడకు వచ్చాడు. ఆ దొంగను చూసి తన కుమారుడిగా గుర్తించాడు. ఆగ్రహంతో రగిలిపోయి అందరి ముందు అతడ్ని కొట్టాడు. తానే శిక్షిస్తానంటూ అక్కడి నుంచి తీసుకెళ్లాడు. దీంతో స్థానికులు ఇది చూసి నోరెళ్లబెట్టారు. అయితే చోరీలు చేస్తున్న పోలీస్ కుమారుడిపై కేసు నమోదు చేసి చట్టం ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

