pocso act | అర్జున్ రెడ్డి సినిమా చూసి అసభ్య ప్రవర్తన, 14 ఏండ్ల బాలుడిపై పోక్సో కేసు

బంజారాహిల్స్ : సినిమాల ప్రభావంతో ఓ బాలుడు ఎనిమిదేళ్ల బాలికను ముద్దుపెట్టుకోవడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించాడు. ఇటీవల తాను చూసిన కొన్ని సినిమాల్లో చూసిన సన్నివేశాలను చూసి బాలికను ముద్దుపెట్టుకోవడంతో కేసు నమోదయింది. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లో నివాసం ఉంటున్న బాలిక(8) ఒక ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది.
పక్కింటి వాచ్మెన్ కొడుకు(14) మంగళవారం సాయంత్రం అపార్ట్మెంట్వద్దకు వచ్చి అక్కడ ఆడుకుంటున్న బాలికను 6వ ఫ్లోర్లో ఎవరో పిలుస్తున్నారంటూ లిఫ్ట్‌లో తీసుకువెళ్లాడు. లిఫ్ట్‌లో వెళ్తున్న సమయంలో బాలికపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో కిందకు వచ్చిన తర్వాత తల్లికి చెప్పింది. ఈ మేరకు బాలిక తల్లి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలుడిపై 354తో పాటు పోక్సొ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కేసు విచారణలో భాగంగా బాలుడిని పీఎస్‌కు పిలిపించి విచారించగా తాను ఇటీవల అర్జున్‌రెడ్డి, డియర్ కామ్రెడ్ సినిమాలు టీవీలో చూసానని, వాటిలో హీరోయిన్ను ముద్దు పెట్టుకునే సీన్లు తనకు నచ్చాయని, తాను కూడా అలా చేయాలనే ఉద్దేశ్యంతో అలా చేశానంటూ చెప్పడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

