ముంబై అశ్లీల వీడియో రాకెట్ : గెహనా వశిష్ట్ సహా ఐదుగురిపై తాజా చార్జిషీట్!

ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అశ్లీల వీడియోల రాకెట్ కేసులో ముంబై పోలీసులు బాలీవుడ్ మోడల్, నటి గెహనా వశిష్ట్ సహా ఐదుగురిపై తాజా చార్జిషీట్ నమోదు చేశారు. వర్ధమాన నటీమణులను అశ్లీల చిత్రాల్లో నటించేలా గెహనా వశిష్ట్ ఒత్తిడి చేసేవారని చార్జిషీట్లో ముంబై పోలీసులు అభియోగాలు మోపారు. ఆపై ఆయా వీడియోలను మూడు యాప్స్‌లో ఆమె అప్లోడ్ చేశారని చార్జిషీట్లో ప్రస్తావించారు.
అశ్లీల వీడియోల రాకెట్ కేసుకు సంబంధించి పోలీసులు రెండవ చార్జిషీట్ నమోదు చేశారు. 500 పేజీలతో కూడిన చార్జిషీట్లో నటి, మోడల్ గెహనా వశిష్ట్‌తో పాటు అభిజిత్ బాంబ్లే, బాబూరావు ప్రహ్లాద్ అలియాస్ అజయ్ శ్రీమంత్, ప్రిన్స్ కుమార్ అలియాస్ కశ్యప్, అరవింద్ కుమార్ శ్రీవాస్తవ్ అలియాస్ యష్ ఠాకూర్ పేర్లున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబైలో అశ్లీల వీడియోల రాకెట్‌ను రట్టు చేసిన ముంబై పోలీసులు ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, నిర్మాత రాజ్ కుంద్రా సహా పలువురిని అరెస్ట్ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

