17 ఏండ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. నలుగురు యువకులు అరెస్ట్
Kerala Girl: కేరళలో దారుణం జరిగింది. 17 ఏండ్ల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై

కోజికోడ్: కేరళలో దారుణం జరిగింది. 17 ఏండ్ల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఘటన గురించి ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎట్టకేలకు రెండు వారాల తర్వాత బాలిక విషయం బయటపెట్టడంతో ఆలస్యంగానైనా ఆ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. కేరళలోని కోజికోడ్ జిల్లా కుట్టియాడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 3న బాధిత బాలికను ఆమె స్నేహితుడు స్థానికంగా ఉండే ఓ టూరిస్ట్ స్పాట్‌కు ఆహ్వానించాడు. అక్కడికి వెళ్లిన బాలికను రిసార్ట్ లోపలికి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన జ్యూస్ తాగించాడు. ఆమె మత్తులోకి జారుకోగానే తన ముగ్గురు స్నేహితులను పిలిచి నలుగురు కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి స్పృహలోకి వచ్చిన బాలికను విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి ఆమె ఇంటి దగ్గర వదిలి వెళ్లారు.
అయితే, రెండు వారాల నుంచి మూభావంగా ఉన్న బాలిక ఎట్టకేలకు ధైర్యం చేసి మంగళవారం సాయంత్రం తల్లిదండ్రులకు జరిగిన ఘోరం గురించి చెప్పింది. దాంతో వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ ఉదయం నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

