మరో మతం యువతితో కలిసి ప్రయాణిస్తున్న యువకుడికి కత్తిపోట్లు

బెంగళూరు: మరో మతం యువతితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న యువకుడ్ని కొందరు దారుణంగా కొట్టి కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ వ్యక్తిపై దాడి చేసిన వారిని బజరంగ్ దళ్కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. కర్ణాటకలోని మంగళూరులో గురువారం ఈ ఘటన జరిగింది. వేర్వేరు మతాలకు చెందిన యువతీ, యువకుడు క్లాస్మేట్స్ మరియు స్నేహితులు. గురువారం వారిద్దరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంగళూరు నుంచి బెంగళూరు వెళ్తున్నారు. బెంగళూరు గురించి తెలిసిన ఆ వ్యక్తి సహాయంగా ఆమె వెంట వెళ్తున్నాడు.
కాగా, కారులో వచ్చిన కొందరు మంగళూరు శివారులో ఆ బస్సును అడ్డగించారు. ఆ యువతీ యువకుడ్ని బలవంతంగా బస్సు నుంచి కిందకు దించారు. ఆ యువకుడ్ని దారుణంగా కొట్టారు. తుంటిపై కత్తితో పొడిచారు. అడ్డుకోబోయిన యువతిపైనా చేయి చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నదని వైద్యులు తెలిపారు.
బజరంగ్ దళ్కు చెందిన వ్యక్తులపై హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరో నలుగురిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వేర్వేరు మతాలకు చెందిన ఆ యువతీ, యువకుడు కలిసి ప్రయాణిస్తున్నట్లు బజరంగ్ దళ్కు చెందిన వారికి ఎవరు సమాచారం ఇచ్చారు అన్నదానిపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

