మేడ్చల్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

హైదరాబాద్ : అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మేడ్చల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. లక్షా 40 వేల నగదు, 3.5 తులాల బంగారం, సెల్ఫోన్లు, రెండు బైకులు, వెండి నాణేలు, కొడవళ్లు, కట్టర్లు, సుత్తెలు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో 11 మందిని అరెస్టు చేశామని, మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ ముఠాలో దాదాపు 60 మంది ఉన్నట్లు సమాచారం ఉందని.. మిగిలిన వారు ఎక్కడున్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.
సామాన్లు విక్రయించే నెపంతో కాలనీల్లో రెక్కీలు చేసి యజమానులు లేని ఇళ్లను ఎంచుకొని ఈ ముఠా దోపిడీలకు పాల్పడుతున్నది. ఎవరికీ అనుమానం రాకుండా కుటుంబాలతో వేర్వేరు ప్రాంతాల్లో తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటూ కాలనీల్లో చోరీలు కొనసాగిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన వారిని విచారిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో మీడియాకు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mukesh Ambani: ముగ్గురు పిల్లల్ని చూస్తూ.. కన్నీటిని ఆపుకోలేకపోయిన ముఖేశ్ అంబానీ
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైద్యరంగం నిర్వీర్యం : ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల
Arnab Cyclone | అర్నబ్ తుపాను బీభత్సం.. కోస్తా తీరం అతలాకుతలం..!
Harsh Gujral: జోకేసిన హర్ష్ గుజ్రాల్.. నవ్వుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్
Patlolla Karthik Reddy | పబ్లిక్ లేకుండా మూసీ పబ్లిక్ హియరింగ్ ఏందో..? రేవంత్ సర్కార్‌పై పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

