ముంబై : క్యాటరింగ్ పని ముగించుకుని శనివారం తెల్లవారుజామున ఇంటికి తిరిగివస్తుండగా మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో కలకలం రేపిన ఈ ఘటనలో మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
క్యాటరింగ్ కంపెనీలో పనిచేసే మహిళ శనివారం విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఆమెతో పరిచయం ఉన్న నిందితుడు అడ్డగించాడు. ఎందుకు ఆలస్యంగా వస్తున్నావని ఆమె ప్రశ్నించగా ఈ లోగా అక్కడికి చేరుకున్న మరో నిందితుడు తాను ఆమెను ఇంటివద్ద డ్రాప్ చేస్తానని తన రూంకు తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు.
ఈలోపు మరికొందరు నిందితులు చేరుకని సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నేరానికి పాల్పడిన అనంతరం వారు పరారయ్యారు. బాధితురాలి సమాచారంతో పాటు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించారు. వారిలో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.