ఫోన్లో గంటల తరబడి చాటింగ్ : కన్నకూతురిని కడతేర్చిన తండ్రి
గంటల తరబడి మొబైల్ ఫోనలో చాటింగ్ చేస్తున్న కూతురిని పలుసార్లు మందలించినా వినకపోవడంతో ఆగ్రహానికి లోనైన తండ్రి కన్నకూతురిని కడతేర్చిన ఉదంతం హర్యానాలోని సోనిపట్ జిల్లాలో వెలుగుచూసింది.
చండీఘఢ్ : గంటల తరబడి మొబైల్ ఫోనలో చాటింగ్ చేస్తున్న కూతురిని పలుసార్లు మందలించినా వినకపోవడంతో ఆగ్రహానికి లోనైన తండ్రి కన్నకూతురిని కడతేర్చిన ఉదంతం హర్యానాలోని సోనిపట్ జిల్లాలో వెలుగుచూసింది. బాలిక తండ్రి మహ్మద్ నూర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై హత్య కేసు నమోదు చేశారు.
బాలిక గంటల తరబడి మొబైల్ ఫోన్లో మునిగిపోతూ చాటింగ్ చేస్తుండటంతో నిందితుడు పలుమార్లు ఆమెను వారించాడు. కూతురి ప్రవర్తనపై విసుగు చెందిన నూర్ ఆమెను ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడని సోనిపట్ ఏఎస్పీ దీప్తి గార్గ్ తెలిపారు. భదానా గ్రామంలో బాలిక మృతి చెందిందని తమకు సమాచారం రాగా ఘటనా స్ధలానికి వెళ్లామని మెట్లపై నుంచి పడటంతో బాలిక మరణించిందని కుటుంబ సభ్యులు నమ్మబలికారని చెప్పారు.
బాలికను ఊపిరిఆడకుండా చేయడంతో మరణించిందని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని దీప్తి గార్గ్ వెల్లడించారు. బాలిక ప్రవర్తనతో విసుగు చెంది తాను కన్నకూతురిని కడతేర్చానని దర్యాప్తులో నిందితుడు నూర్ తెలిపాడని చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru | నీళ్లెత్తేందుకు ఎందుకిన్ని డ్రామాలు.. విడుదల చేసిన నీళ్లు బీర్ల తయారీ కోసమా .. పొలాలకా!
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
YTPS | తెలంగాణ ఇంజినీర్లపైనే వేటు.. వైటీపీఎస్‌లో ఆంధ్రా అధికారులకు పెత్తనం
KCR | ఇదీ.. కేసీఆర్ పాలనాదక్షత.. కాళేశ్వరం నీటితో మత్తడి దుంకుతున్న వెలిచాల చెరువులు
CM Commission | సీఎం కమీషన్ 15%.. టెండర్లు, బిల్లుల చెల్లింపులో విచ్చలవిడి అవినీతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

