జైపూర్ : రాజస్ధాన్ రాజధాని జైపూర్లోని విద్యాధర్ నగర్ సమీపంలో సినీస్టార్ సినిమా హాలులో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఘటన సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అగ్నిమాపక యంత్రాలను రప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. సినిమా థియేటర్లోని బేస్మెంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో కొందరు చిక్కుకుపోగా వారిని బయటకు తీసుకువచ్చేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. కాగా ఈ ఘటనలో ఎవరూ మరణించిన, గాయపడిన వివరాలు వెల్లడికాలేదు. అగ్నిప్రమాదానికి కారణాలేమిటనేది ఇంకా నిర్ధారించలేదని ప్రాధమిక దర్యాప్తు అనంతరం ఈ వివరాలు వెల్లడవుతాయని అధికారులు చెప్పారు.