మాజీ ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం : పెండ్లి పేరుతో మిస్ ఇండియా కంటెస్టెంట్‌ను లోబరుచుకుని ఆపై మత్తుమందు ఇచ్చి..!

లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే సయీద్ అహ్మద్ కుమారుడు కవి అహ్మద్‌పై పోలీసులు లైంగిక దాడి, దోపిడీ ఆరోపణలపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నిందితుడు పేరు మార్చుకుని పెండ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ మహిళకు దగ్గరయ్యాడు.
మత్తు మందు కలిపిన పానీయాలు ఇచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే భార్య, కూతురు కూడా తనను వేధింపులకు గురిచేశారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమైన తాను సివిల్‌లైన్స్‌లో జిమ్ నిర్వహిస్తున్నానని బాధితురాలు వివరించారు. 2018లో కవి అహ్మద్ తన పేరు మార్చుకుని తనతో స్నేహం చేశాడని, బ్యూటీపార్లర్ నడిపిద్దామని చెబుతూ తనను లక్నోకు తీసుకువెళ్లాడని పేర్కొన్నారు. అక్కడకు వెళ్లగానే మత్తుమందు ఇచ్చి తనను లైంగికంగా వేధించేవాడని, తన అభ్యంతరకర వీడియోలు తీసి వాటిని చూపుతూ బ్లాక్మెయిల్ చేశాడని బాధితురాలు ఆరోపించారు.
తాను ప్రయాగరాజ్ వెళ్లినా అక్కడకు వచ్చిన నిందితుడు తనను తుపాకీతో భయపెట్టి లైంగిక దాడికి పాల్పడి వేధింపులకు గురిచేశాడని తెలిపారు. ఇక ఆదివారం తాను సివిల్లైన్స్కు వెళ్లగా నిందితుడు తన అనుచరుడితో అడ్డగించి తన గోల్డ్ చైన్‌ను దొంగిలించాడని, తన సిమ్ కార్డును లాక్కున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా నిందితుడు అహ్మద్‌పై లైంగిక దాడి, లూటీ ఆరోపణలపై కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని సివిల్ లైన్స్ పోలీసులు తెలిపారు.
మరోవైపు బ్లూటీ పార్లర్ నడిపేందుకు ఇచ్చిన రూ ఆరు లక్షలు తిరిగి ఇవ్వాలని తన కుమారుడు కోరడంతోనే యువతి తప్పుడు కేసు నమోదు చేసిందని మాజీ ఎమ్మెల్యే సయీద్ అహ్మద్ ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్ధుల ప్రోద్బలంతోనే ఈ ఆరోపణలు తెరపైకి తెచ్చారని అన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

