న్యూఢిల్లీ: ఒక మహిళ నుంచి మొబైల్ ఫోన్ స్నాచింగ్ చేసిన మరో మహిళను సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు పట్టించింది. దేశ రాజధాని ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్న ఒక మహిళను నిందితురాలు జ్యోతి వెనుక నుంచి దాడి చేసి ఆమె మొబైల్ ఫోన్ స్నాచింగ్ చేసింది. ఈ సందర్భంగా ఇద్దరు మహిళల మధ్య కొంత పెనుగులాట జరిగింది. చివరకు జ్యోతి ఆ మహిళను పక్కకు తోసి కింద పడిన మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్లగా బాధితురాలు ఆమె వెంట పడింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో ఇదంతా రికార్డైంది. దీంతో మంగోల్‌పురి ప్రాంతానికి చెందిన నిందితురాలు జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ సీసీటీసీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
दिल्ली के सुल्तानपुरी में एक महिला से दूसरी महिला ने की झपटमारी,मारपीट कर जबरन मोबाइल छीना,पुलिस ने सीसीटीवी फुटेज के आधार पर आरोपी महिला ज्योति को गिरफ्तार कर लिया है,अपने आप में अनोखा मामला pic.twitter.com/lUtqD75iX9
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) June 16, 2021