దారుణం.. గేమ్ ఆడినందుకు తిట్టిన తండ్రి.. గొంతు నొక్కి చంపిన కుమారుడు

అహ్మదాబాద్: మొబైల్ ఫోన్లో గేమ్ ఆడటంపై తండ్రి తిట్టగా, గొంతు నొక్కి కుమారుడు హత్య చేశాడు. గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. బుధవారం ఒక వ్యక్తిని ఇచ్ఛాపూర్‌లోని న్యూ సివిల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే అతడు చనిపోయినట్లు చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చిన పోలీసులు ఆ వ్యక్తి ఎలా చనిపోయాడని ఆరా తీశారు. బాత్రూమ్లో జారిపడి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మరోవైపు ఆ వ్యక్తి మృతదేహానికి గురువారం పోస్ట్‌మార్టం నిర్వహించారు. గొంతునొక్కడం వల్ల అతడు మరణించినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో వైద్యులు పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆ కుటుంబాన్ని ప్రశ్నించగా 17 ఏండ్ల బాలుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. మొబైల్లో గేమ్ ఆడుతున్న తనని తండ్రి తిట్టాడని, ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని తెలిపాడు. తాను గొంతునొక్కడంతో తన తండ్రి చనిపోయినట్లు చెప్పాడు. దీంతో బాలుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు జువెనైల్ హోమ్‌కు తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

