భోలక్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ అరెస్టు
హైదరాబాద్ : విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన భోలక్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ గౌసుద్దీన్‌ను ముషీరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గౌసుద్దీన్‌పై 353, 506 IPC సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆ కార్పొరేటర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసు స్టేషన్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
భోలక్‌పూర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజాము వరకు హోటళ్లు, షాపులు తెరిచి ఉన్నాయి. దీంతో హోటళ్లను, షాపులను మూసి వేయించేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులను భోలక్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ గౌసుద్దీన్ అడ్డుకున్నారు. వారితో దురుసుగా ప్రవర్తించారు. రంజాన్ మాసం ముగిసే వరకు రాత్రి పూట కూడా హోటళ్లు, షాపులు తెరిచి ఉంటాయని కార్పొరేటర్ చెప్పారు. అయితే.. తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని.. సమయానికి హోటళ్లను మూసివేయాలని పోలీసులు చెప్పబోతే.. మీరు రూ. 100కు పనిచేసే మనుషులని సదరు కార్పొరేటర్ నోరు పారేసుకున్నాడు.
అయితే విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఓ కార్పొరేటర్ వ్యవహార శైలిని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి దృష్టికి ట్విట్టర్ ద్వారా తీసుకెళ్లారు. పోలీసులకు గౌరవం ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ నెటిజన్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి నిరక్షరాస్యుల ప్రవర్తనను సహించేది లేదని ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ సీరియస్‌గా స్పందిస్తూ.. ఆ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ట్వీట్ చేశారు.
విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా డీజీపీ మహేందర్ రెడ్డిని రాష్ట్ర మంత్రి కేటీఆర్ కోరిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవర్నీ సహించేది లేదని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

