భర్తపై యాసిడ్ దాడి.. ఆ తర్వాత ఐదేళ్ల కుమారుడితో కలిసి..
Acid Attack | నిత్యం వేధిస్తున్న ఓ భర్తపై భార్య యాసిడ్ దాడి చేసి.. తన ఐదేళ్ల కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. రేజిలాల్, బిందు అనే దంపతులకు

తిరువనంతపురం : నిత్యం వేధిస్తున్న ఓ భర్తపై భార్య యాసిడ్ దాడి చేసి.. తన ఐదేళ్ల కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. రేజిలాల్, బిందు అనే దంపతులకు కొన్నేండ్ల క్రితం వివాహం కాగా, వారికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి. బిందును రేజిలాల్ వేధించేవాడు. ఆ వేధింపులు భరించలేని భార్య.. ఆదివారం రాత్రి గాఢ నిద్రలో ఉన్న భర్తపై యాసిడ్ దాడి చేసింది. ఆ తర్వాత క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. ఐదేళ్ల కుమారుడితో ఇంటి నుంచి పారిపోయింది. సమీపంలో ఉన్న బావిలో కుమారుడిని తోసేసి తాను ఆత్మహత్య చేసుకున్నది.
భర్త అరుపులు
యాసిడ్ దాడి భరించలేని భర్త గట్టిగా కేకలు వేశాడు. దీంతో ఇరుగుపొరుగు వారు అప్రమత్తమై అక్కడికి చేరుకుని, అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రేజిలాల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మూడు రోజుల క్రితం గొడవ
మూడు రోజుల క్రితం బిందు, రేజిలాల్ మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆ రోజు కూడా బిందు గట్టిగా ఏడ్వడంతో.. తామంతా వచ్చి సర్దిచెప్పామని పేర్కొన్నారు. అంతలోనే ఈ దారుణం జరిగిందని స్థానికులు అన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ వీడియో సాంగ్ విడుదల.!
Varanasi | ‘వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషన్స్.. మహేశ్ బాబు సినిమా కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రభుత్వ అసమర్దత వల్లే పంటలు ఎండుతున్నాయి : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
NZvIND: ఇండియాతో మూడో టీ20.. న్యూజిలాడ్ ఫస్ట్ బ్యాటింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

