న్యూఢిల్లీ: స్కూటర్‌ను రాసుకుంటూ బైక్‌పై వెళ్లిన వ్యక్తి, అతడితో ఉన్న మరో వ్యక్తిపై స్థానికులు దాడి చేసి దారుణంగా కొట్టారు. ఢిల్లీలోని పాలమ్ ప్రాంతంలో ఈ నెల 18న ఈ ఘటన జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు ఒక స్కూటర్‌ను రాసుకుంటూ వెళ్లడంతో స్థానికులు వారిని అడ్డుకుని దాడి చేశారు. ఒక వ్యక్తి చేతితో ముఖంపై పంచ్‌లు ఇవ్వగా మరో వ్యక్తి కర్రతో తలపై కొట్టాడు. దీంతో బైక్ నడిపిన వ్యక్తి తలకు గాయాలయ్యాయి. బైక్ వెనుక కూర్చొన్న మరో వ్యక్తిపైనా కొందరు దాడి చేసి కొట్టారు. అక్కడ ఉన్న సీసీటీవీలో ఇది రికార్డు అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తమ కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయని, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేయాలని అతడి పేరెంట్స్ డిమాండ్ చేశారు.
दिल्ली के पालम इलाके की साद कॉलोनी में मामूली बात पर रोडरेज में लड़के की पिटाई,बाइक सवार पर रॉड से हमला pic.twitter.com/wHtX3A3pAm
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) June 27, 2021