Gold Robbery | చాందినీ చౌక్ వద్ద బంగారం దోపిడీ.. జలంధర్‌లో ఐదుగురు నిందితుల అరెస్ట్
Gold Robbery | ఢిల్లీలోని చాందినీ చౌక్ వద్ద బంగారం బిస్కట్లను దోచుకుని.. పంజాబ్ లోని జలంధర్ లో తల దాచుకున్న ఐదుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Gold Robbery | ఢిల్లీలోని చాందీని చౌక్ వద్ద ఒక జ్యువెల్లరీ దుకాణ ఉద్యోగి వద్ద నుంచి బంగారం దోచుకెళ్లిన ఐదుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జలంధర్ ప్రాంతంలో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఒక మహిళ (42) కూడా ఉన్నారు. ఆమెతోపాటు నలుగురు వ్యక్తులు కలిసి రెండు కిలోల బరువు ఉన్న 17 బంగారం బిస్కట్లను దోచుకుని పారిపోయేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. నిందితులు ఖయాల ప్రాంత వాసులు నవన్ నీత్, మోహ్సిన్ ఖాన్ , ధీరజ్, అంకిత్ పొర్వాల్, ఠాగూర్ గార్డెన్ ఎక్స్టెన్షన్ వాసి సోనూ సూరి ఉన్నారు.
ఈ నెల 22 మధ్యాహ్నం 2.45లకు ఉద్యోగ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద నుంచి పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఒక వ్యక్తి ఫోన్ చేసి, తాను బంగారం బిస్కట్లు ఉన్న బ్యాగ్‌ను తమ యజమానికి అప్పగించేందుకు వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బైక్.. తర్వాత మరొక బైక్ అడ్డగించాయని తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొంత సేపటి తర్వాత నిందితులు వెళ్లిన బైక్‌ల్లో ఒకటి జలంధర్‌లో దొరికింది.
తమ స్నేహితులు నవ్ నీత్, సోనూ సూరీలకు సదరు వ్యక్తి బంగారం బిస్కట్లు తీసుకెళ్తున్న సంగతి తెలుసునని నిందితులు చెప్పారు. ఈ బంగారం దోచుకుందామని ప్లాన్ చేశామని తెలిపారు. ఢిల్లీలో ఉంటే అరెస్ట్ చేస్తారన్న భయంతో జలంధర్ పారిపోయామని చెప్పారని డీసీపీ (ఔటర్) హరేంద్ర సింగ్ చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | మా ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా?.. కాంగ్రెస్ నేతలకు రైతు సవాల్
Malasiya | భారతీయులకు మలేషియా షాక్.. వీసా ఫ్రీ ఎంట్రీ నిలిపివేత
Aadhar Card | ‘పుట్టిన తేదీకి ఆధార్ కార్డ్ ధ్రువపత్రం కాదు’
PF Withdraw | ఇకపై నెలనెలా పీఎఫ్ విత్‌డ్రా.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం
Shah Rukh Khan | షారుఖ్ఖాన్అరుదైన ఘనత.. ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

