పోహా కట్లెట్
ఒక కప్పు, ఆలుగడ్డలు: రెండు, పచ్చిమిర్చి తురుము: ఒక టీస్పూన్, ఉల్లిగడ్డ: ఒకటి, కొత్తిమీర, కరివేపాకు తురుము: కొద్దిగా, నిమ్మరసం: రెండు టీస్పూన్లు, బియ్యపు పిండి: ఒక టేబుల్ స్పూన్, కారం, ధనియాల పొడి: ఒక టీస్పూన్ చొప్పున, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా.
కావలసిన పదార్థాలు
అటుకులు (లావు): ఒక కప్పు, ఆలుగడ్డలు: రెండు, పచ్చిమిర్చి తురుము: ఒక టీస్పూన్, ఉల్లిగడ్డ: ఒకటి, కొత్తిమీర, కరివేపాకు తురుము: కొద్దిగా, నిమ్మరసం: రెండు టీస్పూన్లు, బియ్యపు పిండి: ఒక టేబుల్ స్పూన్, కారం, ధనియాల పొడి: ఒక టీస్పూన్ చొప్పున, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా.
తయారీ విధానం
అటుకులను బాగా కడిగి అరకప్పు నీళ్లు పోసి పది నిమిషాలు నానబెట్టాలి. ఆలుగడ్డలను ఉడకబెట్టి మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. నీటిని పీల్చుకుని ఉబ్బిన అటుకులను కూడా మెత్తగా మెదపాలి. ఒక గిన్నెలో ఆలుగడ్డ, అటుకుల ముద్ద, తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మరసం, బియ్యపు పిండి, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకోవచ్చు. స్టవ్‌మీద పాన్‌పెట్టి గరిటెడు నూనెవేసి వేడి చేయాలి. మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని మందంగా అరచేతితో కట్లెట్లలా ఒత్తుకోవాలి. వాటిని వేడి నూనెలో వేసి, సన్నని మంటపై గోధుమరంగులోకి మారేవరకు రెండు వైపులా తిప్పుతూ కాల్చుకుంటే వేడివేడి పోహా కట్లెట్ సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

