కావలసిన పదార్థాలు: పాలు: రెండు కప్పులు,
యాపిల్ ముక్కలు: ఒక కప్పు, చక్కెర: 3 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్: 3 చుక్కలు, వెనిలా
ఐస్‌క్రీం: ఒక కప్పు
తయారీ విధానం: ముందుగా యాపిల్ని చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, చక్కెరతోపాటు మెత్తగా మిక్సీ పట్టాలి. మొత్తం పేస్ట్‌లా అయ్యాక పాలు, ఐస్‌క్రీం, ఎసెన్స్ వేసి మరోసారి బ్లెండ్ చేసి గ్లాసుల్లో పోసి యాపిల్ ముక్కలతో సర్వ్ చేసుకుంటే సరి. చల్లచల్లని
యాపిల్ మిల్క్ షేక్ రెడీ.