చికెన్ వింగ్స్
చికెన్ వింగ్స్: పావు కిలో, మైదా: రెండు టేబుల్ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్: ఒక టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, పసుపు: చిటికెడు, మిరియాల పొడి: పావు టీస్పూన్,
కావలసిన పదార్థాలు
చికెన్ వింగ్స్: పావు కిలో, మైదా: రెండు టేబుల్ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్: ఒక టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, పసుపు: చిటికెడు, మిరియాల పొడి: పావు టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, వెన్న: రెండు టేబుల్ స్పూన్లు, నూనె: వేయించడానికి సరిపడా, సోయా సాస్: ఒక టీస్పూన్, రెడ్ చిల్లీ సాస్: ఒక టేబుల్ స్పూన్, వెనిగర్: ఒక టీస్పూన్, వేయించిన తెల్లనువ్వులు: అర టీస్పూన్.
తయారీ విధానం
చికెన్ వింగ్స్‌ను బాగా కడిగి ఉప్పు వేసిన నీళ్లలో గంటపాటు నానబెట్టాలి. ఒక గిన్నెలో చికెన్ వింగ్స్, కారం, గరం మసాలా, పసుపు, మిరియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి అరగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, చిటికెడు ఉప్పు వేసి చికెన్ వింగ్స్ జోడించి..
నీళ్లు పోయకుండా వాటికి పిండి పట్టించాలి. కడాయిలో నూనె వేడయ్యాక చికెన్ వింగ్స్ వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత, స్టవ్ మీద పాన్ పెట్టి వెన్న వేసి.. బాగా వేడయ్యాక రెడ్‌చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, ఉప్పు కలపాలి. ఆ మిశ్రమం ఉడుకుతుండగానే వేయించిన వింగ్స్ వేయాలి. తర్వాత, రెండు నిమిషాలు ఎక్కువ మంటపై వేయించాలి. పైనుంచి వేయించిన నువ్వులు చల్లుకుంటే వేడివేడి చికెన్ వింగ్స్ సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

