Cinema News | కీరవాణి సంగీతం.. చంద్రబోస్ సాహిత్యం
హరికృష్ణ మనవడు, దివంగత జానకీరామ్ తనయుడు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ సీనియర్ దర్శకుడు వైవీఎస్ చౌదరి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
Cinema News | హరికృష్ణ మనవడు, దివంగత జానకీరామ్ తనయుడు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ సీనియర్ దర్శకుడు వైవీఎస్ చౌదరి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. న్యూ టాలెంట్ రోర్స్ పతాకంపై యలమంచిలి గీత నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ను ప్రకటించారు.
తెలుగమ్మాయి వీణ రావు హీరోయిన్గా నటించనుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యాన్ని అందించబోతున్నారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణల రచయిత. ఈ సందర్భంగా దర్శకుడు వైవీఎస్ చౌదరి మట్లాడుతూ ‘కీరవాణిగారు యుగపురుషుడులాంటి వారు. ఆయన నాకు మర్చిపోలేని పాటలు అందించారు. అలాంటి గొప్ప వ్యక్తితో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది.
చంద్రబోస్ సాహిత్యం అద్భుతంగా ఉండబోతున్నది. సాయిమాధవ్ బుర్రా ప్రతి సినిమాకు గొప్పగా ఎదిగారు. ఆయన మా చిత్రానికి మాటలు రాయడం ఆనందంగా ఉంది. మంచి కూచిపూడి డ్యాన్సర్ అయిన తెలుగమ్మాయి వీణ రావుని కథానాయికగా పరిచయం చేస్తున్నాం’ అన్నారు. కీరవాణి, చం ద్రబోస్, వైవీఎస్ చౌదరి వంటి గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని సాయిమాధవ్ బుర్రా పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- chandrabose
- Janakiram
- Keeravani
- NTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

