RRR: ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల డ్యాన్స్‌కి ఫిదా అయిన యూట్యూబ్

రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం ఆర్ఆర్ఆర్. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. చిత్రం నుండి ఇటీవల రెండో సింగిల్ సాంగ్ విడుదల కాగా, నా పాట సూడు..నా పాట సూడు..నాటు నాటు..వీర నాటు..ఊర నాటు అంటూ సాగే ఈ పాటలో టాలీవుడ్ టాప్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో డాన్స్ చేయడం నిజంగా అభిమానులకు కన్నుల పండుగగా అనిపించిది.
ప్రస్తుతం ఈ పాట సౌత్ ఇండియా లో టాప్ ప్లేస్ ను చేరుకుంది. ఈ పాట తాజాగా 20 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడే ఇలా ఉంటే సినిమా విడుదలైతే రికార్డుల ఎన్ని బ్రేక్ అవుతాయో అని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.అయితే ఈ పాటతో పాటు ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ డ్యాన్స్‌లకు యూట్యూబ్ ఫిదా అయింది. “హానెస్ట్ గా చెప్పాలి అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ ల డాన్స్ 0.5 స్లో మోషన్ లో పెట్టినా కూడా మేము ఫాస్ట్ గానే ఫీల్ అవుతున్నాం” అని ట్వీట్ చేసింది యూట్యూబ్.
ఇద్దరు హీరోల మాస్ డ్యాన్స్‌లకు అంతా ఫిదా అవుతున్నారు. వెండితెరపై మాత్రం వీరి పర్ఫార్మెన్స్ కనులపండుగగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాటకు ఎంఎం కీరవాణి తన సంగీతాన్ని అందించగా చంద్రబోసు లిరిక్స్ అందించాడు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటని ఆలపించారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషలలో ఫుల్ సాంగ్ ని నవంబర్ 10న(బుధవారం) చిత్ర యూనిట్ విడుదల చేసింది. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ తో పాటు అలియా భట్, శ్రియ శరన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
to be honest, Ram Charan and NTR's dance will still feel fast at 0.5x speed pic.twitter.com/o44mU14FgP
— YouTube India (@YouTubeIndia) November 11, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

