యష్‌రాజ్, నవిమి గాయక్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అభిరామ్’. రామకృష్ణార్జున్ దర్శకుడు. జింకా శ్రీనివాసులు నిర్మాత. ఈ చిత్రంలోని ‘చాల్లే చాల్లే’ అనే లిరికల్ వీడియోను ఇటీవల దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మెలోడి పాట ఇది. విజువల్స్ ఆకట్టుంటాయి. నిర్మాణానంతర పనులు తుదిదశలో వున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు.