‘యశోద కళ్లు తెరిచి చూసే సరికి తానో కొత్త ప్రపంచంలో ఉన్నాననే నిర్దారణకు వచ్చింది. ఏమాత్రం పరిచయం లేని కొత్త పరిసరాలు, వాతావరణం ఆమెలో ఓ రకమైన భయోద్వేగాన్ని కలిగించాయి. అంతలో కిటికీ తెరిచి చూసి అక్కడే ఉన్న ఓ పావురాన్ని అందుకోవాలని ఆమె ప్రయత్నించింది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ‘యశోద’ చిత్రం చూడాల్సిందే’ అంటున్నారు హరి-హరీష్. ఈ దర్శకద్వయం రూపొందించిన తాజా చిత్రం ‘యశోద’. సమంత టైటిల్ రోల్‌ని పోషిస్తున్నది. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. గురువారం ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఇప్పటికే ఎనభైశాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చివరి షెడ్యూల్ చేస్తున్నాం. ఆగస్ట్ 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నాం’ అని చెప్పారు. వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీశర్మ, సంపత్‌రాజ్ తదితరులు చిత్ర తారాగణం.