అలనాటి జ్ఞాపకాలను గుర్తుతెస్తుంది
‘పాత తెలుగు చిత్రాలను నేను బాగా ఇష్టపడతాను. అప్పటి సినిమాల్లో కుటుంబ బంధాలు, మానవ విలువలను అద్భుతంగా చూపించేవారు. ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ చిత్ర కథాంశం కూడా అదే తరహాలో ఉంటుంది’ అన్నారు నిర్మాత యష్ రంగినేని. బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై ఆయన నిర్మించిన ఈ చిత్రంలో చైతన్యరావు, లావణ్య జంటగా నటించారు.
‘పాత తెలుగు చిత్రాలను నేను బాగా ఇష్టపడతాను. అప్పటి సినిమాల్లో కుటుంబ బంధాలు, మానవ విలువలను అద్భుతంగా చూపించేవారు. ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ చిత్ర కథాంశం కూడా అదే తరహాలో ఉంటుంది’ అన్నారు నిర్మాత యష్ రంగినేని. బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై ఆయన నిర్మించిన ఈ చిత్రంలో చైతన్యరావు, లావణ్య జంటగా నటించారు. చెందు ముద్దు దర్శకుడు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్మాత యష్ రంగినేని పాత్రికేయులతో ముచ్చటించారు.
దర్శకుడు మూడేళ్ల క్రితం ఈ కథ చెప్పారు. పీరియాడిక్ ఇతివృత్తమిది. 1980 దశకం నేపథ్యంలో అందమైన కోనసీమ పల్లెటూరిలో కథ నడుస్తుంది. ఇందులో ఊహించని మలుపులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. హృద్యమైన ప్రే మకథగా మెప్పిస్తుంది. కొన్ని కారణాల వల్ల హీరో పెళ్లి ఆలస్యమవుతుంది. ఇంతలో ఓ అనూ హ్య సంఘటన కారణంగా అతని ప్రేమకు అవరోధాలు ఏర్పడుతాయి. ఈ నేపథ్యంలో హీరో జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. 80వ దశ కం నాటి జ్ఞాపకాలను మన కళ్లముందుంచుతుం ది. ఈ సినిమాలో నేనూ ఓ ముఖ్యమైన పాత్రను పోషించాను. కోనసీమ ప్రకృతి అందాలు ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి
యువత కనెక్ట్ అవుతున్నారు
ఈ సినిమా కోసం మూడువేల కిలోమీటర్ల టూర్‌ను నిర్వహించాం. చాలా చోట్ల ప్రివ్యూస్ వేశాం. పీరియాడిక్ చిత్రం కాబట్టి నేటి యువత ఈ కథతో కనెక్ట్ అవుతారో లేదో అనుకున్నాం. కానీ సినిమా వారికి బాగా నచ్చింది. చిత్ర హీరో చైతన్యరావు ఈ సినిమాలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచాడు. విజయ్ దేవరకొండతో మేము నిర్మించిన పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్ చిత్రాలను త్వరలో రీరిలీజ్ చేయబోతున్నాం. ప్రస్తుతం రెండు స్క్రిప్ట్‌లు సిద్ధం చేసి పెట్టుకున్నాం. మంచి కథ కుదిరినప్పుడు విజయ్ దేవరకొండతో తప్పకుండా సినిమా చేస్తాం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

