Suhas | ఒత్తిడిని ఆనందంగా స్వీకరిస్తా

‘హీరో కావాలని ఎప్పుడూ అనుకోలేదు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరు వస్తే చాలనుకున్నా. ‘కలర్‌ఫొటో’ సినిమా నా జీవితాన్ని మార్చింది’ అని అన్నారు సుహాస్. సహాయనటుడిగా కెరీర్‌ను ఆరంభించిన ఆయన ‘కలర్‌ఫొటో’ చిత్రంతో హీరోగా చక్కటిగుర్తింపును సొంతం చేసుకున్నారు. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా సుహాస్ బుధవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘కెరీర్ పరంగా నాని, విజయ్‌దేవరకొండ, సమంతతో పాటు నేను పనిచేసిన దర్శకులందరూ సలహాలిస్తుంటారు. మంచి కథల్ని ఎంచుకోమని చెబుతుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సీన్ పూర్తిచేయడం వరకే నా బాధ్యత ఉంటుంది. ఆ తర్వాత రిలాక్స్ అయిపోతా. హీరోగా నటించేటప్పుడు తెలియని భయం, ఒత్తిడి ఉంటాయి. ప్రతిక్షణం సెట్స్‌లో అప్రమత్తంగా ఉండాలి. ఆ టెన్షన్‌ను నేను ఎంజాయ్ చేస్తుంటాను. ప్రస్తుతం ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాలో నటిస్తున్నా. దర్శకుడు ప్రశాంత్ చెప్పిన కథ నవ్విస్తూనే నాతో కన్నీళ్లు పెట్టించింది. విజయవాడకు చెందిన పద్మభూషణ్ అనే యువకుడి కథ ఇది. మధ్యతరగతి కుటుంబాల్లోని అనుబంధాలు, ఆప్యాయతల్ని ఆవిష్కరిస్తూ విభిన్నంగా ఉంటుంది. అక్టోబర్‌లో ఈ సినిమా విడుదలకానుంది. ప్రస్తుతం ఐదు సినిమాల్లో హీరోగా నటిస్తున్నా. కథానాయకుడిగానే కాకుండా మంచి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నా’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
Trivikram | ప్రభాస్‌లో ఆ యాంగిల్‌ను ఎవరూ చూపించలేదు.. త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

