Tapsee Pannu | సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్లపైనే ఎందుకు తోసేస్తారో.. తాప్సీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Tapsee Pannu | కెరీర్ ఆరంభంలో దక్షిణాది చిత్రసీమలో అదృష్టాన్ని పరీక్షించుకున్న పంజాబీ సుందరి తాప్సీ ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చింది. ప్రయోగాత్మక కథాంశాలతో హిందీ చిత్రసీమలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.
Tapsee Pannu | కెరీర్ ఆరంభంలో దక్షిణాది చిత్రసీమలో అదృష్టాన్ని పరీక్షించుకున్న పంజాబీ సుందరి తాప్సీ ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చింది. ప్రయోగాత్మక కథాంశాలతో హిందీ చిత్రసీమలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ హిందీతో పాటు దక్షిణాదిలో కూడా సత్తాచాటుతున్నది. తాజా ఇంటర్వ్యూలో ఈ సొగసరి తన కెరీర్ తొలినాటి సంగతులను గుర్తు చేసుకుంది. సినిమాలు ఫ్లాప్ అయితే తనను బాధ్యురాలిని చేసి నిందించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘తెలుగులో నేను నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో నాది ఐరెన్‌లెగ్ అంటూ ముద్ర వేశారు.
ఆ రోజుల్లో నాకు సినిమాల ఎంపికపై అవగాహన ఉండేది కాదు. దాంతో సినిమాల విషయంలో కొన్ని తప్పులు జరిగాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నా. సినిమా ఫెయిల్ అయితే హీరోయిన్ను ఎందుకు నిందిస్తారో అర్థమయ్యేది కాదు. ఏవో కొన్ని సన్నివేశాలు, పాటల వరకే కథానాయిక పాత్ర ఉంటుంది. అలాంటప్పుడు వారిపై ఫెయిల్యూర్ బాధ్యత మోపడం సరికాదు. నా విషయంలో అదే జరిగింది. అయితే ఆ చేదు అనుభవాలను మర్చిపోయి హిందీలో మంచి కథలపై దృష్టిపెట్టాను. అక్కడ సాధించిన విజయాలు నటిగా ఎంతో సంతృప్తినిచ్చాయి’ అని తాప్సీ పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

