Rattatataav Song | టాలీవుడ్ యువ నటుడు విశ్వక్సేన్, కాయడు లోహర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఫంకీ. ఈ సినిమాకు కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగానే సినిమా నుంచి సెకండ్ సింగిల్ రాట్టటాటవ్ (Rattatataav) అనే సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఈ పాటకు దేవ్ పవర్ సాహిత్యం అందించగా.. రామ్ మిరియాల పాడాడు. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించాడు. కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో వీకే నరేష్, వీటీవీ గణేష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.