Vishwak Sen | కొత్తదనం ఉండాల్సిందే.. అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్
యువహీరో విశ్వక్సేన్ సినిమా అంటే కథలో ఏదో కొత్తదనం ఉండాల్సిందే. కెరీర్ ఆరంభం నుంచి ఆయన ఎంచుకునే సబ్జెక్ట్స్ వైవిధ్యమైన ఇతివృత్తాలతో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఆయన లేడీ క్యారెక్టర్ ‘లైలా’తో ప్రేక్షకుల ముందుకురాబోతుండటం విశేషం.
యువహీరో విశ్వక్సేన్ సినిమా అంటే కథలో ఏదో కొత్తదనం ఉండాల్సిందే. కెరీర్ ఆరంభం నుంచి ఆయన ఎంచుకునే సబ్జెక్ట్స్ వైవిధ్యమైన ఇతివృత్తాలతో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఆయన లేడీ క్యారెక్టర్ ‘లైలా’తో ప్రేక్షకుల ముందుకురాబోతుండటం విశేషం. విశ్వక్సేన్ కొత్త చిత్రం ‘లైలా’ బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. రామ్‌నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
ఆకాంక్ష శర్మ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి కె.రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, దర్శకుడు హరీష్‌శంకర్ కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్లో విశ్వక్సేన్.. లైలా పాత్రలో ఛార్మింగ్లుక్తో ఆకట్టుకుంటున్నారు. ఆయన మేకోవర్ అద్భుతంగా ఉందని, కథానుగుణంగా లేడీ గెటప్ చక్కగా కుదిరిందని అంటున్నారు.
‘తన అందమైన కళ్లతో..మనోహరమైన రూపంతో ఈ లైలా అందరిని ఆశ్చర్యపరుస్తుంది’ అని విశ్వక్సేన్ లేడీ గెటప్లోని ఫొటోను సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్‌ప్రసాద్, సంగీతం: తనిష్క్ బాగ్చి, జిబ్రాన్, రచన: వాసుదేవమూర్తి, దర్శకత్వం: రామ్ నారాయణ్.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- lady avatar
- Laila
- Vishwak sen
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

