Laththi | విశాల్ లాఠీ టీవీ, ఓటీటీ ప్రీమియర్ తేది ఫిక్స్..
విశాల్ (Vishal) తెలుగు, తమిళ భాషల్లో నటించిన కాప్ డ్రామా లాఠీ (Laththi). పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన లాఠీ ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. ఈ మూవీ ఓటీటీలో విడుదలయ్యే టైం ఫిక్సయింది.
లవ్, మాస్, యాక్షన్, సస్పెన్స్ జోనర్లలో సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విశాల్ (Vishal). తెలుగు, తమిళ భాషల్లో విశాల్ నటించిన కాప్ డ్రామా లాఠీ (Laththi). పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఏ వినోథ్ కుమార్ (A Vinoth Kumar) దర్శకత్వం వహించాడు.
గతేడాది థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లాఠీ ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. ఈ మూవీ ఓటీటీలో విడుదలయ్యే టైం ఫిక్సయింది. లాఠీ జనవరి 14న సన్ నెక్ట్స్ లో ప్రీమియర్ కానుంది. ఇదే విషయాన్ని Sun NXT స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.
అంతేకాదు లాఠీ జనవరి 16న సాయంత్రం 6:30 గంటలకు సన్ టీవీలో కూడా ప్రీమియర్ కానుంది. లాఠీ మూవీని రానా ప్రొడక్షన్స్ బ్యానర్లో రమణ, నంధా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సునయన (Sunaina Yella) ఫీ మేల్ లీడ్‌లో నటించింది. విశాల్ మరోవైపు అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో మార్క్ ఆంటోని సినిమా కూడా చేస్తున్నాడు. ఈ చిత్రాన్నిమినీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు.
మరోవైపు విశాల్ స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్ 2 సినిమా కూడా చేస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ డిటెక్టివ్ సినిమాను విశాల్ హోంబ్యానర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై నిర్మిస్తున్నాడు.
లాఠీ ప్రీమియర్ తేది అనౌన్స్మెంట్ వీడియో..
Laththi streaming from 14th Jan only on Sun NXT#SunNXT #Laththi #LaththiCharge #Vishal #Sunaina #Prabhu #Munishkanth #MeeshaGhoshal #ThalaivasalVijay #AVinothKumar @VishalKOfficial @TheSunainaa pic.twitter.com/SyCNMWbYVw
— SUN NXT (@sunnxt) January 11, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

