Dhruva Natchathiram | స్టైలిష్ అవతార్‌లో విక్రమ్.. గౌతమ్ మీనన్ ధ్రువ నక్షత్రం ట్రైలర్
Dhruva Natchathiram | చియాన్ విక్రమ్ (Vikram) కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా ధ్రువ నక్షత్రం: యుద్ద కాండం (Dhruva Natchathiram). విక్రమ్ అభిమానులకు ట్రైలర్ రూపంలో దసరా కానుక అందించారు మేకర్స్.
Dhruva Natchathiram | స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమాల్లో ఒకటి ధ్రువ నక్షత్రం: యుద్ద కాండం (Dhruva Natchathiram). స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon) దర్శకత్వం వహిస్తున్నాడు. పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. యాక్షన్ స్పై జోనర్లో వస్తున్న ఈ మూవీలో జాన్/ధ్రువ్ పాత్రల్లో కనిపించబోతున్నాడు విక్రమ్.
విక్రమ్ అభిమానులకు ట్రైలర్ రూపంలో దసరా కానుక అందించారు మేకర్స్. ఓ దృక్కోణం గురించి.. మరో చిన్న అడుగు.. పెద్ద ప్రయోగం.. ఏమైనప్పటికీ.. మేము కవాతు చేస్తున్నాము.. అంటూ ట్రైలర్‌ను షేర్ చేశాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. ముంబై దాడుల సమయంలో ల్యాండ్ కావాల్సిన మొదటి NSG ఛాపర్ కొంచెం ఆలస్యమైంది.. అంటూ సాగే వాయిస్ ఓవర్‌తో షురూ అయింది. ముఖ్యమైన మిషన్ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో హింట్ ఇచ్చేశాడు గౌతమ్ మీనన్.
ధ్రువ నక్షత్రం ట్రైలర్..
చాలా రోజుల తర్వాత విక్రమ్ స్టైలిష్ యాక్టింగ్‌ను చూడబోతున్నట్టు ట్రైలర్‌తో అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఐశ్వర్యారాజేశ్, సిమ్రాన్, రాధికా ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
ఈ మూవీని ఒండ్రగ ఎంటర్టైన్మెంట్, కొండదువోం ఎంటర్టైన్మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి యువ సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ధ్రువ నక్షత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
ధ్రువ నక్షత్రం టీజర్ ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

