వరంగల్ అమ్మాయి.. హైదరాబాద్ అబ్బాయి
‘సంతాన ప్రాప్తిరస్తు’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. విక్రమ్, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లు. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మాతలు.
‘సంతాన ప్రాప్తిరస్తు’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. విక్రమ్, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లు. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం షూటింగ్ శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అంబికాకృష్ణ కెమెరా స్విచాన్ చేయగా, వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకటరామరాజు క్లాప్ ఇచ్చారు.
మధుర శ్రీధర్‌రెడ్డి తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్‌ను నిర్మాతలిద్దరూ కలిసి దర్శకుడు సంజీవ్‌రెడ్డికి అందించారు. ‘వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి మధ్య జరిగే మ్యూజికల్ ఎంటర్టైనర్ ఇది. కుటుంబప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా అవుతుంది. ఎంటర్టైన్మెంట్గా సాగే ఈ కథలో ఓ కాంటెంపరరీ ఇష్యూ కూడా ఉంటుంది.
పెళ్లయిన కొత్తలో భార్యాభర్తలు ఎదుర్కొనే ఓ సమస్యను వినోదాత్మకంగా చూపించనున్నాం’ అని దర్శకుడు చెప్పారు. వచ్చే నెల 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. వెన్నెలకిశోర్, అభినవ్ గోమటం, మురళీధర్‌గౌడ్, జీవన్‌కుమార్, తాగుబోతు రమేశ్, రచ్చరవి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మహిరెడ్డి పండుగుల, మాటలు: కల్యాణ్ రాఘవ్, సంగీతం: సునీల్‌కశ్యప్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

