Nithone Nenu | నీతోనే నేను అంటోన్న సినిమా బండి హీరో.. ఈ శుక్రవారం రిలీజవుతున్న సినిమాలివే..!
Nithone Nenu | ప్రతీ వారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి ఉంటుందని తెలిసిందే. ఒక్కోసారి శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాలు క్యూలో ఉంటే.. అప్పుడప్పుడు చిన్న సినిమాలు సందడి చేస్తుంటాయి.
Nithone Nenu | ప్రతీ వారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి ఉంటుందని తెలిసిందే. ఒక్కోసారి శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాలు క్యూలో ఉంటే.. అప్పుడప్పుడు చిన్న సినిమాలు సందడి చేస్తుంటాయి.
థియేటర్లలో సందడి చేసే సినిమాలు..
నీతోనే నేను :ఈ వారం థియేటర్లలో విడుదలవుతున్న సినిమాల్లో ఒకటి సినిమా బండి ఫేం వికాస్ వశిష్ఠ (Vikas vasistha)నటించిన నీతోనే నేను (Nithone Nenu). వికాష్ వశిష్ట, మోక్ష, కుషిత కళ్లపు హీరోహీరోయిన్లుగా నటించారు. అంజిరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీమామిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై లో ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మించారు. సమాజాన్ని గొప్పగా తీర్చి దిద్దే టీచర్స్‌కి సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్‌ను 33 రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. మెదక్‌లో నీతోనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అక్టోబర్ 13న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది.
నీతోనే నేను టీజర్..
నీతోనే నేను ట్రైలర్..
నీతోనే నేను సాంగ్స్..
సగిలేటి కథ :
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న చిత్రం సగిలేటి కథ (Sagileti Katha). రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ కథనందిస్తూ దర్శకత్వం వహించారు. కోడి అహంకారంతో కూడిన ఫన్నీ స్కిట్‌తో ఈవెంట్ ప్రారంభమైంది. ఈ చిత్రం రుచికరమైన చికెన్ తినడానికి తహతహలాడే ఒక పాత్ర దురాశ చుట్టూ తిరిగే కథ. హీరో నవదీప్, సీ స్పేస్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 13న థియేటర్లలో సందడి చేయనుంది.
సగిలేటి కథ ట్రైలర్..
రాక్షస కావ్యం :
నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్ , పవన్ రమేష్ , దయానంద్ రెడ్డి (Dayanand Reddy) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాక్షస కావ్యం’ (Raakshasa Kaavyam). శ్రీమాన్ కీర్తి డైరెక్ట్ చేశాడు. పురాణాల్లోని ఒక్కో యుగంలో ఒక్కో రాక్షసులుగా పుట్టిన జయవిజయులు కలియుగంలోకి వస్తే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ పాయింట్‌తో సాగే ఈ సినిమా అక్టోబర్ 13న సందడి చేయనుంది.
రాక్షస కావ్యం ట్రైలర్..
గాడ్: (తమిళ సినిమా-తెలుగు డబ్బింగ్): అక్టోబర్ 13
ఓటీటీ ప్లాట్‌ఫాం సినిమాలు..
ప్రైమ్ వీడియో:
మార్కో ఆంటోనీ (తమిళ సినిమా: తెలుగు డబ్బింగ్) : అక్టోబర్ 13
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
Sultan Of Delhi (హిందీ వెబ్‌సిరీస్) : అక్టోబర్ 13
ఆహా:
మట్టి కథ: అక్టోబర్ 13
మిస్టేక్ : అక్టోబర్ 13
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

