Vijay Varma | విజయ్ వర్మ లైఫ్‌లో కొత్త టర్న్.. తమన్నాతో బ్రేకప్ తర్వాత కొత్త అమ్మడితో డేటింగ్
Vijay Varma | సినీ పరిశ్రమలో ప్రేమలు, బ్రేకప్‌లు కొత్త విషయం కాదు. కానీ కొన్ని జంటలు విడిపోతే మాత్రం అభిమానులకు జీర్ణించుకోవడం కష్టమే. అలాంటి జంటల్లో విజయ్ వర్మ – తమన్నా భాటియా ఒకటి. దాదాపు రెండేళ్ల పాటు గాఢమైన ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి చేసుకుంటారని అభిమానులు భావించారు.
Vijay Varma | సినీ పరిశ్రమలో ప్రేమలు, బ్రేకప్‌లు కొత్త విషయం కాదు. కానీ కొన్ని జంటలు విడిపోతే మాత్రం అభిమానులకు జీర్ణించుకోవడం కష్టమే. అలాంటి జంటల్లో విజయ్ వర్మ – తమన్నా భాటియా ఒకటి. దాదాపు రెండేళ్ల పాటు గాఢమైన ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి చేసుకుంటారని అభిమానులు భావించారు. అయితే అనూహ్యంగా వీరిద్దరూ విడిపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇద్దరూ కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ సమయంలోనే దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో తమ సంబంధాన్ని పరోక్షంగా అంగీకరించారు. అయితే 2025 ప్రారంభం నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని వార్తలు వినిపించాయి. ముఖ్యంగా పెళ్లి విషయంలో అభిప్రాయ భేదాలే బ్రేకప్‌కు కారణమని బీటౌన్‌లో టాక్ వినిపించింది. తమన్నా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి విజయ్‌తో ఉన్న ఫోటోలను తొలగించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. 2025 మార్చి నాటికి వీరిద్దరూ అధికారికంగా విడిపోయినట్లు సమాచారం.
తమన్నాతో విడిపోయిన కొద్ది కాలానికే విజయ్ వర్మ మరో నటి తో కలిసి తిరుగుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ముంబైలో విజయ్ వర్మ, అలియా ఖురేషితో కలిసి డిన్నర్‌కు వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరూ కలిసి బయటకు రావడం, ఒకే కారులో వెళ్లడం వంటి విజువల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గతంలో విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్‌తో డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ కూడా వినిపించాయి. అయితే తాజా పరిణామాలతో అలియా ఖురేషితో కొత్త బంధం మొదలైందా? అనే అనుమానాలు నెటిజన్లలో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘మట్కా కింగ్’ సిరీస్‌లో అలియా కూడా భాగం కావడం గమనార్హం. షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం మరింత దగ్గరగా మారిందనే ప్రచారం జరుగుతోంది.
అలియా ఖురేషి బాలీవుడ్లో ఎదుగుతున్న యువ నటి. షారుఖ్ ఖాన్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం జవాన్‌లో కీలక పాత్రలో కనిపించింది. అందులో ‘జాన్వి’ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగానే కాకుండా, అలియా ఒక మంచి గాయని, సాంగ్ రైటర్ కూడా. వెబ్ సిరీస్‌ల ద్వారా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తోంది. ప్రస్తుతం విజయ్ వర్మ, అలియా ఖురేషి డేటింగ్ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటనలేదు. ఇవి కేవలం రూమర్స్ మాత్రమేనా, లేక నిజంగానే కొత్త ప్రేమ కథ మొదలైందా అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Aaliya Qureshi
- dating
- love
- tamannah
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

