తమిళ చిత్రసీమలో అగ్ర హీరో దళపతి విజయ్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన సినిమా విడుదలవుతుందంటే తమిళనాట ఉత్సవ వాతావరణం నెలకొంటుంది. రజనీకాంత్ తర్వాత మాస్లో అంతటి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు విజయ్. ఆయన తాజా చిత్రం ‘లియో’ ఈ నెల 19న విడుదలకు సిద్ధమవుతున్నది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాఫియా, డ్రగ్స్ నేపథ్యంలో తెరకెక్కించారు.
ఈ సినిమాకు హీరో విజయ్ 120 కోట్ల పారితోషికాన్ని స్వీకరించారని తమిళ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత సెకండ్ హయ్యస్ట్ రెమ్యునరేషన్ ఇదేనని చెబుతున్నారు. దాదాపు మూడొందల కోట్ల వ్యయంతో ‘లియో’ చిత్రాన్ని తెరకెక్కించగా..అందులో విజయ్ రెమ్యునరేషన్‌కే 120కోట్ల్లు కేటాయించడం విశేషం. మెర్సల్, మాస్టర్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో దళపతి విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆయన రెమ్యునరేషన్‌ను కూడా భారీగా పెంచారని అంటున్నారు.