చరిత్ర మరచిన వీరుల కథ
మనం మరచిన చరిత్రను, ఘనమైన సాంస్కృతిక, పోరాట వారసత్వాన్ని నేటి తరానికి తెలియజెప్పాలనే లక్ష్యంతో ‘రణబాలి’ సినిమా తీశామని చెప్పారు అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ. చరిత్రలో మరుగున పడిన ఓ మహాధ్యాయాన్ని ఈ సినిమాలో చూపించామని అన్నారు. ఆయన టైటిల్ రోల్లో నటించిన ‘రణబాలి’ చిత్రం దసరా కానుకగా సందర్భంగా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకురానుంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ సందర్భంగా శనివారం కథానాయకుడు విజయ్ దేవరకొండ విలేకరులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
‘రణబాలి’ చిత్రాన్ని ఓ లక్ష్యంతో తీశాం. ఇటీవల చెన్నైకి చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్‌తో మాట్లాడుతుంటే 17వ దశకంలో సంభవించిన బెంగాల్ మహా కరువు గురించి చెప్పారు. అప్పుడు కొన్ని లక్షలమంది ప్రజలు ఆకలితో చనిపోయారట. ఈ విషాదాన్ని తలచుకుంటే ఒళ్లు జలదరించింది. ఆ సమయంలో బ్రిటీషర్లు చేసిన దారుణాల గురించి తెలుసుకొని అమెరికన్లు తమ దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమం ప్రారంభించారట. మన ప్రజల దైన్యం అమెరికా ప్రజల హృదయాలను కలచివేసిందని ఆ జర్నలిస్ట్ వివరించాడు. అలాంటి ఓ యథార్థ, చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ చిత్రం తెరకెక్కింది.
చరిత్రలో మన దేశ ప్రజలకు జరిగిన అన్యాయాల గురించి తెలుసుకుంటే ఇవన్నీ నిజమా? ఇన్ని దారుణాలు జరిగాయా? అనే షాక్‌కు గురవుతాం. దేశ భవిష్యత్తును అర్థం చేసుకోవాలంటే చరిత్ర తెలుసుకోవడం ముఖ్యం. ‘రణబాలి’ చిత్రంలో అదే ప్రయత్నం చేశాం. బాహ్య ప్రపంచానికి ఏమాత్రం తెలియకుండా చరిత్రలో రహస్యంగా మిగిలిపోయిన అధ్యాయాలను ఈ సినిమాలో చూపించాం. గొప్ప బాధ్యతగా భావించి ఈ సినిమా చేశాను.
బ్రిటీషర్లు మన సౌకర్యం కోసం రైల్వేలైన్స్ నిర్మించలేదు. మన పంటలు, సుగంధ ద్రవ్యాలు, ఖనిజాల్ని దోచుకొని వాటిని తమ దేశానికి తరలించుకోవడానికి నౌకాశ్రయాలను కలుపుతూ రైల్వేలైన్స్ నిర్మించారు. 1876-1878 మధ్య కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో వచ్చిన కరువు వల్ల దాదాపు 80 లక్షల మంది చనిపోయారు. కరువు సమయంలో కూడా బ్రిటీషర్లు రెట్టింపు పన్నులు వసూలు చేస్తూ ప్రజల్ని హింసించేవారు. పన్నులు కట్టని వారిని భారీ ప్రాజెక్ట్‌లు, రైల్వే లైన్ల నిర్మాణం వద్దకు తరలించి వారితో కఠోరమైన పనులు చేయించేవారు. పనిచేయని వారు ఆకలి చావులు చావాల్సిందే. ఇలాంటి దారుణాల మీద పరిశోధన చేసి దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ‘రణబాలి’ కథ రాశాడు.
ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదురైనా మన సంస్కృతి, నమ్మకాలు మనల్ని ఒక్కటిగా నిలబెట్టాయి. కరువు సమయాల్లో గ్రామదేవతల్ని కొలిచి జాతరలు జరుపుకునేవాళ్లం. అప్పటికీ దేశానికి స్వాతంత్య్రం కావాలనే భావన ప్రజల్లో లేదు. కానీ విదేశీయుల పెత్తనాన్ని ఎదిరిస్తూ ఆత్మగౌరవం కోసం పల్లె ప్రజలు ఎదురుతిరిగేవారు. మన చరిత్రలో ప్రజల పక్షాన నిలబడిన ఎంతో మంది వీరులున్నారు. మన బుర్రకథల్లో, జానపద కథల్లో ప్రస్తావించిన అలాంటి వీరులే ‘రణబాలి’ కథకు స్ఫూర్తి. చరిత్రలో మరుగున పడిన ఓ వీరుడి కథ ఇది.
అనంతపురం నేపథ్యంలో నడిచే కథ ఇద. బ్రిటీష్ పాలనా కాలం నాటి వాతావరణం, మన సంస్కృతి, వీరుల గొప్పదనాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాం. సినిమా మొదలైన కొద్ది నిమిషాల్లోనే ప్రేక్షకులు రణబాలి ప్రపంచంలో లీనమైపోతారు. ఎక్కడా నాటకీయత లేకుండా ప్రతీ సన్నివేశం సహజంగా ఉండేలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ జాగ్రత్తలు తీసుకున్నాడు. నేను పదేళ్లు పుట్టపర్తిలో చదువుకోవడం వల్ల రాయలసీమ యాసపై కొంచెం పట్టుంది. అయితే ఈ సినిమా కోసం మూడు నెలల పాటు సమయాన్ని కేటాయించి సీమ యాసను నేర్చుకున్నా. తెలంగాణ, రాయలసీమ యాస మధ్య కొన్ని సారూప్యతలు ఉంటాయి కాబట్టి అంత కష్టంగా అనిపించలేదు.
‘రణబాలి’ ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. థియేటర్ల నుంచి బయటకొచ్చిన ప్రేక్షకులు మన చరిత్ర, సంస్కృతి గురించి మాట్లాడుకుంటారు. దర్శకుడు ప్రతీ విషయంలో పరిశోధన చేసి ప్రామాణికమైన అంశాలతో సినిమాను తీర్చిదిద్దాడు. జయమ్మ పాత్రలో రష్మిక పేరును దర్శకుడే సూచించారు. గతంలోనూ నా సినిమాల్లో రష్మికను తీసుకోవాలనే ప్రస్తావన వచ్చింది. అయితే కొన్ని కథలకు తను కరెక్ట్ కాదనిపించింది. మేమిద్దరం కలిస్తే ఆ కథ చాలా ప్రత్యేకంగా ఉండాలనుకున్నాం. ‘రణబాలి’తో అది కుదిరింది. ఈ సినిమాలో మా ఇద్దరి పాత్రల మధ్య మంచి ఎమోషనల్ డ్రామా ఉంటుంది.
నా సినిమాలకు టికెట్ ధరలు పెరగవు
నా సినిమాలకు టికెట్ ధరలు పెంచొద్దని నిర్మాతలకు చెబుతుంటాను.‘రణబాలి’ నుం చి నా రాబోయే ఏ సినిమాకు టికెట్ ధరలు పెంపు ఉండదు. నా కాలేజీ రోజుల్లో టికెట్ ధరలు పెంచడం వల్ల సినిమాలు చూడలేక బాధపడేవాన్ని. హీరో అయిన తర్వాత అలాంటి పరిస్థితి ఉండకూడదనుకున్నా. ఒకవేళ రాజమౌళిగారితో సినిమా చేస్తే తప్ప నా సినిమాలకు టికెట్ రేట్స్ పెంచడం అంటూ జరగదు. (నవ్వుతూ).
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

