నిజమైన పవర్ అంటే..
విజయ్ ఆంటోనీ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్లర్'. రియా సుమన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రధారులు. ధన దర్శకత్వంలో డీటీ రాజా, డీఆర్ సంజయ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
విజయ్ ఆంటోనీ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్లర్’. రియా సుమన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రధారులు. ధన దర్శకత్వంలో డీటీ రాజా, డీఆర్ సంజయ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 27న పాన్ ఇండియా స్థాయిలో చిత్రం విడుదల కానుంది. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘ఈ ప్రపంచంలో నిజమైన పవర్ అంటే డబ్బు, అధికారం కాదు. ఒక మనిషిని నమ్మి అతని వెనకున్న జనమే..’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది.
విజయ్ ఆంటోని డిఫరెంట్ గెటప్స్‌లో అధారాలు దొరక్కుండా ముగ్గుర్ని చంపేస్తాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తుంటారు. ఈ యాక్షన్ సీన్లతోపాటు హీరోయిన్‌తో రొమాంటిక్ లవ్‌స్టోరీ కూడా ట్రైలర్లో రివీలైంది. స్వార్థపూరిత రాజకీయ నాయకుడిగా చరణ్‌రాజ్ కనిపించారు. మొత్తంగా పొలిటికల్, యాక్షన్, లవ్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ సాగింది. సాంకేతికంగా కూడా సినిమా అభినందనీయంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: నవీన్ కుమార్.ఐ, సంగీతం: వివేక్, మెర్విన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

