vidyullekha: విద్యుల్లేఖని విడాకులెప్పుడని అడుగుతున్న నెటిజన్స్.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన కమెడీయన్

తెలుగు,తమిళ భాషలలో తన నటనతో అలరించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న కమెడీయన్ విద్యేల్లేఖా రామన్. ఒకప్పుడు చాలా బొద్దుగా ఉండే విద్యుల్లేఖ లాక్ డౌన్ తర్వాత స్లిమ్‌గా మారింది. అనంతరం కీటో డైట్ ఎక్స్‌పర్ట్‌గా వ్యవహరిస్తున్న సంజయ్‌ని ప్రేమించి వివాహం చేసుకుంది. సెప్టెంబర్ 9న తమ వివాహం జరిగినట్లు ఇటీవల ఓ పెళ్లి ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది.
తమిళ, సింధీ సంప్రదాయాల ప్రకారం జరిగిన వీరి వివాహానికి చెన్నై వేదికగా నిలిచింది. కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ జంట ఒక్కటైంది. అయితే పెళ్లి తర్వాత హనీమూన్‌కి వెళ్లిన ఈ జంట సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు పెడుతూ నెటిజన్స్‌కి వినోదాన్ని అందిస్తుంది. అయితే రీసెంట్గా స్విమ్ సూట్ డ్రెస్‌లో దిగిన పిక్ షేర్ చేయగా, విడాకులు ఎప్పుడు?’ అని చాలామంది మెసేజ్ చేస్తున్నారని విద్యుల్లేఖా రామన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
1920 నుంచి బయటకొచ్చి 2021లోకి రండి. సమాజంలోని ఆలోచనా ధోరణే అసలైన సమస్య. ఒకవేళ మహిళ వస్త్రాధరణే విడాకులకు కారణం అయితే… చక్కగా దుస్తులు ధరించిన వాళ్లందరూ సంతోషకమైన వైవాహిక జీవితాల్లో ఉన్నారా? అని ప్రశ్నించింది. సంజయ్ లాంటి భర్త లభించడం నా అదృష్టం. విమర్శల్ని వదిలేయండి. సంకుచిత వ్యక్తిత్వం ఉన్న మనుషులని నేను మార్చలేను అంటూ విద్యుల్లేఖా పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

