Venkaesh| వెంకీ ఖాతాలో రూ.300 కోట్ల హిట్ .. ఈ సినిమా తర్వాత ఏకంగా 25 కథలని రిజెక్ట్ చేశాడా..!
Venkaesh| విక్టరీ వెంకటేష్ నటించిన సినిమాలు ప్రేక్షకులకి ఏ మాత్రం బోర్ కొట్టించవు. సూపర్ హిట్ కాకపోయిన మినిమం ఆడతాయి. ఆయన నటించిన తాజా
Venkaesh| విక్టరీ వెంకటేష్ నటించిన సినిమాలు ప్రేక్షకులకి ఏ మాత్రం బోర్ కొట్టించవు. సూపర్ హిట్ కాకపోయిన మినిమం ఆడతాయి. ఆయన నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చి సూపర్ హిట్ అయింది. థియేటర్లలో రూ. 300 కోట్లకుపైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.రీసెంట్గా 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది. 92 సెంటర్లలో 50 రోజులు పూర్తి కావడంతో … ఈ మైలురాయి తమ ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల అచంచలమైన అంకితభావంతో సాధ్యమైందని, వారు సినిమాను అన్ని మూలలకు చేరేలా చూశారంటూ దర్శకుడు అనీల్ రావిపూడి ఎమోషనల్ ట్వీట్ చేశారు.
అయితే ఇంత మంచి హిట్ తర్వాత వెంకటేష్ కథల విషయంలో చాలా జాగ్రత్తలు పడుతున్నాడట. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా ప్రేక్షకులకి మరింత వినోదం పంచేలా సినిమా చేయాలని అనుకుంటున్నాడట. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ తర్వాత వెంకటేష్ దాదాపుగా 25కు పైగా కథలు విన్నాడని టాక్. అయితే వాటిలో వెంకీ ఒక్కటి కూడా ఓకే చేయలేదు అని టాక్ . ఏ మాత్రం కొద్దిగా బాలేదు అని అనిపించినా ఎంత పెద్ద డైరెక్టర్ అయిన కూడా వెంకటేష్ మొహమాటం లేకుండా నో చెప్పేస్తున్నాడట. అందుకు కారణం గత అనుభవాలే మరి.
వెంకటేష్ ప్రధాన పాత్రలో రూపొందిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాల తర్వాత శైలేష్ కొలను డైరెక్షన్లో సైంధవ్ అనే యాక్షన్ సినిమా చేశాడు. ఆ మూవీ పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్‌ను కంటిన్యూ చేయాలని భావిస్తున్న వెంకటేష్ కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడట. నచ్చని స్టోరీ ఏదైన తన దగ్గరికి వస్తే వెంటనే రిజెక్ట్ చేస్తున్నాడట. కొత్త డైరెక్టర్స్ నుంచి సీనియర్ డైరెక్టర్ల వరకు స్టోరీలు చెప్తున్నా కూడా వెంటనే కమిట్ కావడం లేదని టాక్ నడుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

