Upasana | పెద్ది ఫీవర్ షురూ.. థియేటర్లో సందడి చేసిన ఉపాసన, ప్రముఖుల శుభాకాంక్షలు
Upasana | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పెద్ది’ విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లోని థియేటర్ల వద్ద మెగా అభిమానుల సందడి అంబరాన్నంటుతోంది.
Upasana | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పెద్ది’ విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లోని థియేటర్ల వద్ద మెగా అభిమానుల సందడి అంబరాన్నంటుతోంది. భారీ కటౌట్లు, బాణాసంచా కాల్చుతూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు కూడా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాపై తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్‌లోని విమల్ 700 ఎంఎం థియేటర్లో ప్రత్యేక ప్రీమియర్ షోకు రామ్ చరణ్ సతీమణి ఉపాసన హాజరయ్యారు.
రామ్ చరణ్ ఊర మాస్ ఎంట్రీ.. యాక్షన్ సీక్వెన్స్ సమయంలో ఉపాసన చిన్న పిల్లల మాదిరిగా అల్లరి చేస్తూ తెగ ఎంజాయ్ చేసింది. కేకలు వేస్తూ.. పేపర్లు విసిరేస్తూ.. విజిల్స్ వేస్తూ ఫుల్ జోష్ లో కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఇక సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ చిత్రబృందానికి అందరూ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.. హీరో వరుణ్ తేజ్ తన ట్వీట్లో, “పెద్ది కోసం రామ్ చరణ్ అన్న ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఆయన అంకితభావం ఎంతో మందికి స్ఫూర్తి. బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్‌తో పాటు మొత్తం టీంకు శుభాకాంక్షలు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని పేర్కొన్నారు.
నటి సమంత కూడా చిత్రంపై ప్రశంసలు కురిపించారు. “ఇది పెద్ది టైమ్. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. చరణ్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఆయన చాలా కష్టపడ్డారు. మొత్తం టీంకు నా శుభాకాంక్షలు. బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం పొల్లాచిలో చిత్రీకరణ జరుపుకుంటున్న మెగా 158 చిత్రబృందం కూడా సెట్స్ నుంచే పెద్ది టీంకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. “రామ్ చరణ్, బుచ్చిబాబు, వృద్ధి సినిమాస్‌కు ఆల్ ది బెస్ట్” అంటూ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ‘పెద్ది’పై ప్రశంసలు కురిపించారు. “మొదటి రోజు నుంచే ఈ సినిమా ప్రయాణం ఆసక్తిని కలిగించింది. రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, కమిట్మెంట్ అసాధారణం. పెద్ది బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి చాలా కాలం గుర్తుండిపోయే వేడుకగా నిలవాలని కోరుకుంటున్నా” అని ఆయన తెలిపారు.
What a wholesome video!! Upasana garu is throwing papers for RC’s entry 😭❤️#Peddi pic.twitter.com/VwpGh40YQ0
— Legend Prabhas Fan 🇮🇳 (@CanadaPrabhasFN) June 3, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

