నవ్వు రాకుంటే నాకు ఫోన్ చేయండి
సప్తగిరి, వీజే సన్నీ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘అన్‌స్టాపబుల్'. నక్షత్ర, అక్సాఖాన్ నాయికలు. రజిత్ రావు నిర్మిస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకుడు. ఈ నెల 9న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ...‘ఈ చిత్ర పోస్టర్ చూస్తే దాని నిండా కమెడియన్స్ కనిపిస్తారు.
సప్తగిరి, వీజే సన్నీ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘అన్‌స్టాపబుల్’. నక్షత్ర, అక్సాఖాన్ నాయికలు. రజిత్ రావు నిర్మిస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకుడు. ఈ నెల 9న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ…‘ఈ చిత్ర పోస్టర్ చూస్తే దాని నిండా కమెడియన్స్ కనిపిస్తారు. ఇండస్ట్రీలోని హాస్య నటులందరినీ పెట్టి ఆద్యంతం నవ్వించాలని చేసిన ప్రయత్నమిది. ప్రతి పాత్ర కథకు ముడిపడి ఉంటుంది. ఇవన్నీ అన్‌స్టాపబుల్‌గా ఉంటాయి. సినిమా చూస్తూ ఎవరికైనా నవ్వు రాకుంటే నాకు ఫోన్ చేయమని ఇటీవల ప్రెస్మీట్లో ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను.
కుటుంబంతో కలిసి చూసేలా ఉంటుంది. సప్తగిరి, సన్నీ..చిచ్చా, మచ్చా అనే పాత్రల్లో కనిపిస్తారు. వీరు చేసిన రచ్చే ఈ సినిమా. సన్నీ మాస్ క్యారెక్టర్లో కనిపిస్తారు. సినిమాకు ప్రధాన బలం సప్తగిరి. ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సీమ శాస్త్రి’, ‘ఈడోరకం ఆడోరకం’ వంటి వినోదాత్మక సినిమాలే నాకు రచయితగా పేరు తీసుకొచ్చాయి. ఇకపై ఏడాదికో కామెడీ మూవీ చేస్తాను. తెలుగులో కొందరు రచయితలకు మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. తమిళనాట కథ రాసిన వారే దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటారు. తెలుగులో కూడా ఆ ట్రెండ్ మొదలైంది. అందుకే కొత్త రచయితలకు దర్శకత్వం గురించి కూడా ఆలోచించమని సలహా ఇస్తున్నాను’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

